న్యూ ఇయర్ వేడుకలు.. డ్రగ్స్ పై పోలీసుల స్పెషల్ ఫోకస్

హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పబ్బులు, హోటళ్ల నిర్వాహకులు కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు.

అటు డ్రగ్స్ మాఫియా సిటీలోని యువతి యువకులను మద్యం మత్తులో దించేందుకు సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ కి తగ్గట్టు డ్రగ్స్ ముఠాలు కూడా తమ బిజినెస్ పై ఫోకస్ చేశాయి. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రగ్స్ కు డిమాండ్ ఉండటంతో కోట్లు దండుకునేందుకు రెడీ అయ్యాయి. 2 నెలల ముందు నుంచే ముఠాలు… సిటీకి డ్రగ్స్ తరలించే పనిలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ మాఫియా ఆట కట్టించేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.

ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు.. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి.. హైదరాబాద్ కు భారీగా గంజాయి సరఫరా అయ్యే అవకాశం ఉండటంతో.. చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి నిఘా పెంచారు పోలీసులు. పబ్ లకు డ్రగ్ సరఫరా చేస్తున్న నైజీరియన్ గ్యాంగ్ లు…  డ్రగ్స్ కేసులో అరెస్టైన కెల్విన్ ముఠాపై ఫోకస్ పెట్టారు. కొత్త రూట్స్ లో డ్రగ్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో.. టాస్క్ ఫోర్స్, SOT, CCS లాంటి స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేట్ బస్సుల్లో నగరానికి డ్రగ్ సరఫరా చేస్తున్నట్టు సమాచారం ఉండటంతో.. స్పెషల్ టీమ్ లతో సెర్చ్ చేయాలని భావిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే సీక్రెట్ ప్రదేశాల్లో నిల్వ చేసి.. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ అమ్మేందుకు సిద్దంగా ఉన్నారని అనుమానిస్తున్నారు.

పబ్, రిసార్ట్ నిర్వాహకులు యువతీ యువకులకు డ్రగ్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. న్యూఇయర్ వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, మత్తు పదార్ధాలను సప్లై చేసినా జైలుకు పంపిస్తామంటున్నారు. డార్క్ నెట్, డీప్ వెబ్ లతో విదేశాల నుంచి డ్రగ్స్ కొంటున్నాయి ముఠాలు. నేరుగా అమ్మితే పోలీసులు పట్టుకుంటారని… ఆన్ లైన్ వెబ్ సైట్లతో కొకైన్, బ్రౌన్ షుగర్, సిలికాన్ వంటి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కొరియర్స్ పార్సిళ్లలో డ్రగ్స్ సేల్ చేస్తుండటంతో నిఘాను పటిష్టం చేశారు పోలీసులు. శివారు ప్రాంతాల్లో మత్తు పదార్ధాల తయారికీ అవకాశం ఉండటంతో అలర్ట్ అయ్యారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates