న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించొద్దు: భజరంగ్ దళ్

ఐటీ హబ్ గా పేరొందిన బెంగళూరులో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించొద్దని ఆ రాష్ట్ర భజరంగ్ దళ్ నాయకులు వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకలు హిందూ సంప్రదాయం కాదని.. దీనికి ఒక నైతికత,ఆధ్యాత్మికత లేదని తెలిపారు. ఈ వేడుకలు భారత యువతను తప్పుడు మార్గంలోకి తీసుకెళుతున్నాయని వారన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే పురుషులు,మహిళలు క్రమశిక్షణ పాటించాలని.. వేడుకల్లో మద్యం, హుక్కా బార్‌, పబ్ లపై  బ్యాన్ విధించాలని చెప్పారు.

మరోవైపు ఈ విషయమై బెంగళూరు పోలీస్ కమిషనర్ స్పందించారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి బార్ లు,పబ్ లపై బ్యాన్ విధించాలని ఎవరూ తమను అడగలేదని తెలిపారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తమకు కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates