న్యూ ఇయర్ స్పెషల్.. జియో 100% క్యాష్ బ్యాక్ ఆఫర్

స్పెషల్ అకేషన్స్ కు ఆఫర్లు ప్రకటిస్తున్న జియో.. న్యూ ఇయర్ కు మరో ఆఫర్ ను అనౌన్స్ చేసింది. రూ.399తో రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 100 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు జియో ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ ను రిలయన్స్ కు చెందిన AJIO(ఈ కామర్స్ యాప్) కూపన్ రూపంలో జియో ఇస్తుంది.

ఈ ఆఫర్ కోసం కస్టమర్ మై జియో యాప్ లో రూ.399తో రీచార్జ్ చేసుకోవాలి. రీచార్జ్ అయిన వెంటనే రూ.399 కూపన్ ను మై కూపన్స్ సెక్షన్ కు జియో యాడ్ చేస్తుంది. AJIO యాప్ లేదా వెబ్ సైట్ లో కనీసం రూ.1000 షాపింగ్ చేస్తే ఈ కూపన్ వాడుకునే వీలుంటుంది. జనవరి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా… కూపన్ వ్యాలిడిటీ మార్చి 15 వరకు ఉంటుందని జియో తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates