న్యూ ఇయర్ స్పెషల్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వెహికిల్ సీజ్

హైదరాబాద్ సిటీలో న్యూ ఇయర్ హడావిడి మొదలైంది. యూత్ ను ఆకర్షించేందుకు పబ్స్, రెస్టారెంట్స్ లో గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రోజు మందుబాబులు రోడ్లపై హల్ చల్ చేసే అవకాశాలు ఉండటంతో… స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వెహికిల్ సీజ్ చేసి కఠిన  చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సిటీతో పాటు ఔట్ స్కర్ట్ లోని పబ్స్, క్లబ్స్, రెస్టారెంట్స్,రిసార్ట్స్ వేదికలవుతున్నాయి. కస్టమర్స్ ను అట్రాక్ట్ చేసుకునేందుకు నిర్వాహకులు భారీ డిస్కాంట్లు కూడా  పెడుతున్నారు. సెలబ్రేషన్స్ లో మందు బాబుల కారణంగా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఫ్లై ఓవర్లపై  ప్రయాణాలు నిషేధించారు. మద్యం మత్తులో వెహికిల్స్ నడపకుండా అడ్డుకునేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో స్పెషల్ చెకింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

డిసెంబర్ 31 రోజు రాత్రి 8 గంటల నుండి 1 గంటల వరకు పబ్ లు, రెస్టారెంట్లలో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంది.  రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్పెషల్ టీంలతో సిటీ మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ పై నిఘా పెట్టిన పోలీసులు ఈవెంట్ నిర్వాహకులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్ నిర్వాహకులే తాగిన వారికి క్యాబ్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలని సూచించారు. అలాగే మద్యం తాగే వారు డ్రైవర్లను పెట్టుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.

గతేడాది డిసెంబర్ 31 రాత్రి రికార్డు స్థాయిలో 2 వేల 499 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను  పోలీసులు బుక్ చేశారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1683, సైబరాబాద్ లిమిట్స్ లో 582, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 234 కేసులు నమోదయ్యాయి. 1,309 టూ వీలర్స్.. 276 కార్లను సీజ్ చేశారు. దీంతో ఈ ఏడాది మరింత కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates