న్యూ పోస్టర్ : ఎన్టీఆర్ బయోపిక్

Ntr Biopic New Poster జై సింహా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 29న ప్రారంభం కానుంది. తేజ దర్శకత్వం‍లో తెరకెక్కనున్న ఈ సినిమాను వారాహి చలనచిత్రం బ్యానర్‌తో బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు.

సినిమాలో ఏఏ అంశాలను చూపించబోతున్నారన్న విషయాన్ని తెలిపేలా పోస్టర్‌ ను రూపొందించారు. ఎన్టీఆర్ చిన్న నాటి విషయాలు గుర్తుగా ఎన్టీఆర్ సొంత ఊరిలోని ఇల్లు వెండితెరపై చూపించనున్నారు. ఎన్టీఆర్ పోషించిన అ‍ద్భుత పాత్రలతో పాటు రాజకీయ ప్రవేశం సందర్భంగా ఎన్టీఆర్ ఉపయోగించిన ప్రచార రథంతో పాటు పార్టీ జెండా కూడా ఉండేలా ఈ పోస్టర్‌ను డిజైన్‌ చేశారు.

Posted in Uncategorized

Latest Updates