న్యూ సెంచరీ స్కూల్ గోడ కూలి.. ఇద్దరు పిల్లలు మృతి

హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం. న్యూ సెంచరీ స్కూల్ లో ఇద్దరు పిల్లలు చనిపోయారు. రోజులాగే ఉదయం స్కూల్ కు వెళ్లారు పిల్లలు. బుధవారం కావటంలో మధ్యాహ్నం తర్వాత యాక్టివిటీస్ కు సంబంధించి స్పెషల్ క్లాస్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 30 మంది పిల్లలు స్కూల్ ఆవరణలోనే కరాటే శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సమయంలో స్కూల్ ప్రహరీగోడ ఒక్కసారిగా కూలిపోయింది. కరాటే శిక్షణ తీసుకుంటున్న పిల్లలపై రాళ్లు పడ్డాయి. పెద్ద రాళ్లు కావటంతో తప్పించుకోలేకపోయారు. ఈ ప్రమాదంలో మహి కృష్ణ (9), చందన(8), నికిత (9), నరేష్ (11), సందీప్ (10), దేవిశ్రీ (10) గాయపడ్డారు. వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరందరూ నాలుగో తరగతి చదువుతున్నారు.
గాయపడిన ఆరు పిల్లల్లో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. చందన, మహికృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు అయ్యారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రతివారం ఇదే ప్లేస్ లో కరాటే శిక్షణ తీసుకుంటారు.

Posted in Uncategorized

Latest Updates