పంచకుల అల్లర్లు : ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు

గతేడాది హర్యానాలోని పంచకులలో జరిగిన హింసకు సంబంధించి ఆరుగురు నిందితులను పంచకుల కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2017 ఆగస్ట్ 28న డేరా సచ్చ సౌద చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కు జైలు శిక్ష పడిన సందర్భంగా… పంచకుల, సిర్సాల్లో హింస చెలరేగింది. గుర్మీత్ అనుచరులు, అభిమానులు విధ్వంసం సృష్టించారు. దీనికి సంబంధించి గయానిరామ్, సంగా సింగ్, హోషియార్ సింగ్, రవి, తర్సీమ్, రామ్ కిషన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆధారాలు లేని కారణంగా వీరిని నిర్దోషులుగా వదిలిపెడుతున్నట్టు పంచకుల కోర్టు సోమవారం (జూలై-30) తీర్పునిచ్చింది.

Posted in Uncategorized

Latest Updates