పంచాయతీలకు ఖరారైన రిజర్వేషన్లు

రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 వేల 750 పంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారయ్యాయి. జిల్లాల వారీగా ఆయా సర్పంచ్ పదవులను రిజర్వ్ చేశారు అధికారులు. ఇందులో ఎస్సీలకు 2 వేల 113, బీసీలకు 2 వేల 345, జనరల్ కు 5 వేల 147 పంచాయతీలను కేటాయించారు. షెడ్యూల్ ఏరియాలో 1,281 పంచాయతీలు ఎస్టీలకు రిజర్వయ్యాయి. ఇందులో 641 మహిళలకు కాగా..మిగితా 640 జనరల్ గా ఉంటాయి. వందశాతం ఎస్టీ జనాభా ఉన్న 1,177 గ్రామాలను కూడా ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మిగతా గ్రామ పంచాయతీల్లో 688 ఎస్టీలకు దక్కాయి.

జిల్లాల నుంచి మండలాల వారీగా పంచాయతీ స్థానాల రిజర్వేషన్లు ప్రకటించడంతో పాటు ఏ పంచాయతీ ఏ కేటగిరీకి వెళ్తుందనే విషయాన్ని కూడా అధికారికంగా ఖరారు చేస్తారు. తర్వాత ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఈ నెలాఖరు లోపు రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తే.. ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్  ఇచ్చేందుకు ఈసీ సిద్ధమవుతోంది.

Posted in Uncategorized

Latest Updates