పంచాయతీలకు ప్రత్యేక అధికారులు : కేసీఆర్

గ్రామ సర్పంచ్ లను పర్సన్ ఇంచార్జులుగా కొనసాగించటం కుదరదన్నారు సీఎం కేసీఆర్. సర్పంచులకే అధికారమిస్తే కోర్టులు కూడా అంగీకరించవన్న సీఎం…అందుకే స్పెషల్ ఆఫీసర్లనే నియమిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు.

ప్రస్తుత సర్పంచ్ లను పర్సన్ ఇంచార్జ్ లు కొనసాగించలేమన్నారు సీఎం కేసీఆర్. పర్సన్ ఇంచార్జులు, పంచాయితీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. ఆగస్టు ఫస్టుతో సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. సర్పంచ్ ల స్థానంలో.. అధికారులను పర్సన్ ఇంచార్జులుగా నియమించడం మినడా మరో మార్గం లేదని…సీఎస్ కమిటీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సర్పంచులకే అధికారమిస్తే కోర్టులు కూడా అంగీకరించవన్నారు. దీంతో గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లనే నియమిస్తున్నట్లు సీఎం చెప్పారు.

ఆగస్టు 2 నుంచి రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు అమల్లోకి రానున్నాయి. దీన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా నియామకాలు చేస్తున్నామని తెలిపారు. చేపట్టాల్సిన పనులను కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. గ్రామాల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి వీలుగా…జిల్లాకు  కోటి చొప్పున 30 కోట్లు అందుబాటులో ఉంచుతామన్నారు.

కొత్తగా వచ్చే పర్సన్ ఇంచార్జులు…గ్రామ కార్యదర్శులకు ప్రస్తుతం గ్రామం ఎలా ఉంది…మూడేళ్ల తర్వాత గ్రామం ఎలా ఉండాలి…మూడేళ్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవాలి…అనే విషయంపై కార్యాచరణ ఇవ్వాలన్నారు. వాటి అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు సీఎం. గ్రామాల్లో చెట్లు పెంచడం, నర్సరీలు ఏర్పాటు చేయడం, స్మశాన వాటిక నిర్మించడం, డంప్ యార్డు ఏర్పాటు, పన్నులు వసూలు చేయడం వంటి వాటిపై చార్ట్ రూపొందించాలన్నారు. పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పు వచ్చిన వెంటనే నిర్వహించాలన్నారు సీఎం. ఎన్నికైన సర్పంచులకు కూడా అసెంబ్లీలో చేసిన చట్టం ప్రకారం విధులు, బాధ్యతలు అప్పగించాలన్నారు సీఎం. మరోవైపు ఈనెల 27న  కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates