పంచాయతీ అంతా ఆన్ లైన్ లోనే

పంచాయతీ ఎలక్షన్స్ రిజర్వేషన్స్ కోసం పల్లె ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ మరో వారంలో వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎన్నికల అధికారులు. ఎలక్షన్స్ కి కోసం ప్రణాళికలు రచిస్తోంది రాష్ట్రా ఈసీ. ఎన్నికల వివరాలను అంతా ఆన్ లైన్ లోనే పొందపరచనున్నారు. పంచాయతీకి పోటీ చేసే వారి వివరాలు మొదలు, నామినేషన్లు, ఫలితాల వరకు స్టేట్ ఎలక్షన్స్ కమిషన్‌  (SEC) వెబ్‌ సైట్‌ లో తెలుసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని పొందుపరుస్తున్నారు.

సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు వేసే వారు, ఉపసంహరించుకునేవారు, పోటీ చేస్తున్న వారి వివరాలు ఈ వెబ్‌ సైట్‌ ద్వారా ఆన్‌ లైన్‌ లో తెలుసుకోవచ్చు. SEC వెబ్‌ సైట్‌ లో టీ ఈ–పోల్‌ లాగిన్, అబ్జర్వర్‌ పోర్టల్, క్యాండిడేట్‌ పోర్టల్, ఓటర్‌ పోర్టల్, EVM ట్రైనింగ్‌ మాడ్యూల్‌ వంటి ఆప్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేందుకు అవకాశం ఉంది.

వీటితో పాటు గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ, ఇతర విషయాలపై అవగాహనతో పాటు ఎప్పటికప్పుడు SECకి సంబంధించిన సమాచారాన్ని, వివరాలు తెలుసుకోవచ్చు. పోటీచేసే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాండిడేట్‌ పోర్టల్‌ లో సర్పంచ్‌ గా పోటీచేసేందుకు అర్హతలు, పాటించాల్సిన నియమ నిబంధనలు, తదితర వివరాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు వెల్లడించారు.

 

Posted in Uncategorized

Latest Updates