పంచాయతీ కార్యదర్శి ఫలితాలపై వివాదం..

హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శి ఎంపిక పరీక్ష ఫలితాలు వివాదాస్పదమవుతున్నాయి. ఫైనల్‌ కీ, ర్యాంకులు, మెరిట్‌ లిస్ట్‌‌‌‌ ఇవ్వకుండానే ‌‌సెలక్టెడ్ లిస్ట్ ఇచ్చారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్ధులు నిన్న(మంగళవారం)  హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి ర్యాలీగా హిమాయత్‌నగర్‌‌‌‌లోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషనర్ నీతూ ప్రసాద్‌‌‌‌ను కలిసి వినతిపత్రమిచ్చారు.

కొన్ని జిల్లాల సెలెక్టెడ్ లిస్ట్ లో హాల్‌ టికెట్ల నంబర్లు రిపీట్‌ అయ్యాయని అభ్యర్థులు ఆరోపించారు. కొన్ని జిల్లాల్లో రిజల్ట్స్ ఇవ్వలేదని, ఫలితాలు నిలిపివేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కమిషనర్ నీతూ ప్రసాద్ సచివాలయంలో సీఎస్ జోషితో భేటీ అయ్యారు. మరోవైపు  పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, వారి కేటగిరీలు, మార్కుల జాబితా కోసం జిల్లా కలెక్టర్ లేదా జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కమిషనర్ నీతూ ప్రసాద్ తెలిపారు. అభ్యర్థులు మార్కు లను www.tsprrecruitment.in  వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని చెప్పారు. రేపటి నుంచి ఓఎంఆర్‌‌‌‌ షీట్స్‌‌‌‌నూ అందుబాటులో ఉంచుతామని కమిషనర్ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates