పంచాయతీ పోరు : బ్యాలెట్ పేపర్లు రెడీ

పంచాయతీ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తోంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి. ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో చర్చిస్తున్నారు.

ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది ఎన్నికల సంఘం. మూడు కోట్ల 20లక్షల 54 వేల 279 బ్యాలెట్ పేపర్లను ఇప్పటికే ప్రింట్ చేసి జిల్లాల్లో రెడీగా ఉంచింది. మొత్తం 55 వేల బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా.. 95 వేలు సిద్ధంగా ఉంచారు. లక్షా 55 వేల ఇంక్ బాటిళ్లను రెడీ చేశారు. డిసెంబర్ 31 తర్వాత ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే జరగనున్నాయి.

తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఓటర్లు కోటి 37 లక్షల 17వేల 469 మంది ఉన్నారు. నోటిఫికేషన్ జారీ చేసేవరకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఓటు వేసే అవకాశం ఇస్తారు. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వాటితో కలిపి మొత్తం 12వేల 751 గ్రామ పంచాయతీలుండగా.. వాటిలో లక్షా 13వేల 354 వార్డులున్నాయి. వీటన్నింటికి కావాల్సిన 150 రకాల ప్రీ సింబల్స్ కూడా గుర్తించింది ఎన్నికల సంఘం.

Posted in Uncategorized

Latest Updates