పంచాయతీ సమరం : ఓటర్ల జాబితా పంపాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశం

panchayatపంచాయతీ ఎనికల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. మార్చి 24న ఓటర్ల జాబితాల సవరణ ముగియడంతో పంచాయతీల వారీగా జాబితాలను పంపాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం.. జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఓటర్ల జాబితా తయారీకి అవసరమైన సమాచారాన్ని అందించాలంటూ అన్నీ జిల్లాల్లోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు, ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఓటర్ల జాబితాల డేటాబేస్ ను డిజిటల్ ఫార్మాట్ లో పంపాలని ఈ లేఖలో ఈసీ కోరింది.

వీలైనంత త్వరగా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని ఈసీ తెలిపింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకూ కొత్తగా ఓట్ల నమోదు, ఓటర్ల జాబితాలోని సవరణలను ఎప్పటికప్పుడు చేపడుతుంటారని ఈసీ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates