పంచ్ లు పడ్డాయి : ఫిట్ నెస్ పై మోడీ Vs కుమారస్వామి

CM KUMAR MODI

ప్రధానమంత్రి మోడీ – కర్నాటక సీఎం కుమారస్వామి మధ్య ఆసక్తికర ట్విట్ వార్ నడిచింది. మోడీ విసిరిన ఫిట్ నెస్ సవాల్ కు.. అదే స్థాయిలో కుమారస్వామి పంచ్ వేశారు. ఇద్దరి మధ్య బుధవారం ఉదయం నడిచిన ఆసక్తికర విశేషాలు ఇలా ఉన్నాయి.

ప్రధానమంత్రి మోడీ ఛాలెంజ్ ట్విట్ :

ప్రతి రోజూ నా దినచర్య వ్యాయామంతోనే మొదలు అవుతుంది. యోగాతోపాటు పంచాట్టాస్, పృధ్వీ, జల్, అగ్ని, వాయు, ఆకాష్ ద్వారా ప్రేరణ పొందిన వ్యాయామాలు చేస్తున్నాను. నా శరీరాన్ని పునరుత్తేజం చేస్తోంది. శ్వాస వ్యాయామాలు కూడా చేస్తాను అని చెబుతూ.. ఈ ఛాలెంజ్ ను కర్నాటక సీఎం కుమారస్వామి ట్విట్ చేశారు.

ఎవరూ ఊహించని విధంగా కర్నాటక సీఎం కుమారస్వామిని ఫిట్ నెస్ ఛాలెంజ్ విసరటం ఆసక్తి రేపింది. ఇటీవలే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా జేడీఎస్ చీఫ్ నడిపిన రాజకీయం తెలిసిందే. సీఎం కుమారస్వామికి స్వయంగా ఛాలెంజ్ విసరటంతో అటు నుంచి రీ ట్విట్ పడింది.

సీఎం కుమారస్వామి రిప్లయ్ ట్విట్ :

నా ఆరోగ్యంపై ప్రధాని మోడీ చూపిస్తున్న శ్రద్ధకు ధన్యవాదాలు. ఫిజికల్ ఫిట్ నెస్ ఆవశ్యకతను ఎప్పుడో గుర్తించాను. అందుకే యోగా, ట్రెడ్ మిల్ అనేవి నా రోజువారీ జీవితంలో భాగం. ప్రస్తుతం నా దృష్టి అంతా కర్నాటక రాష్ట్ర అభివృద్ధి ఫిట్ నెస్ పైనే ఉంది. మీ మద్దతు చాలా అవసరం అంటూ సమాధానం చెప్పారు.

సీఎం కుమారస్వామి శరీరాకృతి, ఫిట్ నెస్ పై మోడీ పంచ్ వేస్తే.. కర్నాటక రాష్ట్ర అభివృద్ధి ఫిట్ నెస్ అంటూ రివర్స్ ఎటాక్ చేశారు. ఇద్దరి మధ్య ఛాలెంజ్ ట్విట్లతో నెటిజన్లు కూడా తమ వంతు కామెంట్స్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates