పంజాబ్ చేరుకున్న 38 మంది భారతీయుల మృతదేహాలు

mru2014లో ఇరాక్‌లో ISIS టెర్రరిస్టుల చేతిలో కిడ్నాప్ కు గురై ప్రాణాలు కోల్పోయిన 38 మంది భారతీయుల మృతదేహాలు భారత్‌కు చేరుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఈ రోజు(ఏప్రిల్1) మధ్యాహ్నాం  మృతదేహాలను పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్‌ తెలిపారు.

టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలను తీసుకొచ్చేందుకు ఆదివారం(ఏప్రిల్ 1) కేంద్రమంత్రి వీకే సింగ్‌ ఇరాక్‌ వెళ్లారు. చనిపోయిన వారిలో 27 మంది పంజాబ్‌ వాసులు… మరో నలుగురు బిహార్‌ వాసులుగా గుర్తించారు. కిడ్నాప్ అయిన వీరిని విడిపించేందుకు భారత ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. కిడ్నాప్ కు గురైన వారిలో ఒకరైన హర్జిత్‌ మాసీ అనే వ్యక్తి వారి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో ఆయన కొన్ని కీలక విషయాలు తెలిపారు. తనతో పాటు బందీలుగా ఉన్న మిగతా వారిని బాదుష్‌ సమీపంలోని ఎడారిలో చంపేసినట్లు తెలిపాడు. 2017 జులైలో మోసుల్‌ నగరంలో ఒకేచోట వందల సంఖ్యలో సామూహిక సమాధులు గుర్తించారు అక్కడి అధికారులు.  ఇందులో 39 మంది భారతీయులు చనిపోయినట్లు తేలింది. మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షలు చేసినట్లు సుష్మాస్వరాజ్‌  తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates