పంజాబ్ మాజీ సీఎంతో అమిత్ షా భేటీ

AMITశిరోమణి అకాళీదళ్ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ను కలిశారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. బీజేపీ సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా NDAలో భాగస్వామ్య పార్టీల అధ్యక్షులను కలుస్తున్నారు అమిత్ షా. బుధవారం (జూన్-6) శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేను కలిసిన అమిత్ షా గురువారం (జూన్-7).. చండీగడ్ లో ప్రకాశ్ సింగ్ బాదల్ తో భేటీ అయ్యారు. 2019 ఎన్నికల్లో పొత్తులు, ప్రణాళికలపైనే ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ మీటింగ్ లో మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates