పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం: 50 మంది మృతి

పంజాబ్ లోని అమృత్ సర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దసరా పండుగ సందర్భంగా చౌరాబజార్ లో  రావణ దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో స్థానికంగా రైల్వే ట్రాక్ పక్కక గుంపులుగా చేరిన ప్రజల్లో కొందరు రైలు పట్టాలపైకి చేరారు. అదే సమయంలో రైలు రావడంతో దాదాపు 50 మంది చనిపోగా…అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.

చౌరాబజార్ లో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు రైల్వే ట్రాక్‌పై ఉన్న వారిని హౌరా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 50 మంది మృతి చెందారు. రైల్వే ట్రాక్‌కు సమీపంలో రావణ దహనం జరుగుతుండగా జనాలు రైల్వే ట్రాక్‌పై నిలబడి దహనాన్ని చూస్తున్నారు. అందరూ దసరా ఉత్సవాల్లో మునగగా.. ఒక్కసారిగా రైల్వే ట్రాక్‌పైకి హౌరా ఎక్స్‌ప్రెస్ దూసుకువచ్చింది. దీంతో ట్రాక్‌పై నిలబడ్డ జనాలను ఢీకొడుతూ వెళ్లిపోయింది. రావణ దహనం జరుగుతుండటం, క్రాకర్స్ పేలుస్తుండటంతో వాటి సౌండ్‌కు రైలు హారన్ జనాలకు వినిపించలేదు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో అక్కడ 500 నుంచి 700 దాకా జనాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను మోడీ ఆదేశాలు జారీ చేశారు.

Posted in Uncategorized

Latest Updates