పంటలకు గుర్తుగా ముదురు ఆకుపచ్చ : పాస్ బుక్ డిజైన్ ఫైనల్

PASSBOOKరైతులకు ఇచ్చే పాసు పుస్తకాలపై రైతు ఫొటో తప్ప మరెవరీ ఫొటో ఉండొద్దని, రాజకీయ నాయకుల ఫొటోలు అవసరం లేదని ఉన్నతాకారులను సూచించారు సీఎం కేసీఆర్. ప్రగతిభవన్‌లో శుక్రవారం (ఫిబ్రవరి-9) కొత్తగా ఇచ్చే పాసుపుస్తకాల డిజైన్లను పరిశీలించారు సీఎం. పంటలకు గుర్తుగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పాసుపుస్తకాన్ని సీఎం ఎంపిక చేశారు. రైతులకు ఇచ్చే కొత్త పుస్తకాలపై తన ఫొటో ముద్రించవద్దని ఈ సందర్భంగా సీఎం అధికారులకు చెప్పారు. కేవలం రైతు ఫొటో, తెలంగాణ ప్రభుత్వ ముద్ర మాత్రమే పాసు పుస్తకంపై ఉండాలని అధికారులకు సీఎం నిర్దేశించారు.

Posted in Uncategorized

Latest Updates