పంటలకు లిక్కర్‌ స్ప్రే .. యూపీ రైతుల నయా ట్రెండ్

 దిగుబడి పెరిగేందుకు, చీడపీడలు ఆశించకుండా ఉండేందుకు పంటలకు రసాయనాలు స్ప్రే చేస్తుంటారు. కానీ ఉత్తర ప్రదేశ్‌ లో కొందరు రైతులు మాత్రం లిక్కర్‌ ను స్ప్రే చేస్తున్నారు. రాష్ట్రం లోని బులంద్‌ షహార్ బిజ్‌ నోర్ ప్రాంతాల్లో రైతులు ఆలుగడ్డ, చెరకు పంటలకు అధిక దిగుబడి కోసం లిక్కర్‌ ని నీటిలో కలిపి స్ప్రే చేస్తున్నారు. ఇలా చేస్తే ఆలుగడ్డ సైజు పెరుగుతుందని రైతులు నమ్ముతున్నారు. అంతేకాకుండా పంట ఏపుగా పెరిగి త్వరగా చేతికొస్తుందని తెలిపారు.

ఎకరా ఆలుగడ్డకు క్వార్టర్ లిక్కర్ స్ప్రే చేస్తే సరిపోతుందని రైతులు చెప్పారు. క్వార్టర్ లిక్కర్‌ ధర యాభై రూపాయలు ఉంటుంది. అదే రసాయనాలు కొనాలంటే వందల్లో ఖర్చవుతుంది. ఇక చెరకు విషయానికొస్తే లిక్కర్‌ క్రిమి సంహారక మందుగా ఉపయోగిస్తున్నారు. అయితే.. లిక్కర్‌ వల్ల పంట దిగుబడి పెరగడం అపోహ అని వ్యవసాయ అధికారులు అంటున్నారు. అంతేకాకుండా లిక్కర్‌ స్ప్రే చేయడం ఎంతో ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. రైతులు మాత్రం రసాయనాలకు బదులు లిక్కర్‌ నే వాడతామంటున్నారు. ఈ కల్చర్‌ ఇప్పుడిప్పుడే మహారాష్ట్ర, హర్యానాకు కూడా పాకుతోంది.

Posted in Uncategorized

Latest Updates