పండక్కి నవ్వించే అల్లుళ్లు.. F2 టీజర్ విడుదల

 వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ఎఫ్2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది క్యాప్షన్. ఈ సినిమా టీజర్ విడుదలైంది. డిసెంబర్ 13న వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు గిఫ్ట్ అందించారు మూవీమేకర్స్. తమన్నా, మెహ్రీన్ పిర్జాదా సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

వరుస కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీని రూపొందిస్తున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాలో లాగే… ఈ సినిమాలోనూ ఓ సిగ్నేచర్ మూమెంట్ ను పరిచయం చేశాడు. టీజర్ చివర్లో అది మెరుపులా అనిపిస్తుంది. పండక్కి బాగా గట్టిగా నవ్వించేటట్టు ఉన్నారుగా అనగానే.. అంతేగా .. అంతేగా అని వెంకటేశ్, వరుణ్ తేజ్ ఇద్దరూ అంటారు. ఇది బాగా క్లిక్ అయ్యేలా ఉంది. ఫిదా సినిమాలో తెలంగాణ అమ్మాయితో ప్రేమలో పడిన హీరో వరుణ్ తేజ్.. ఈసారి తానే ఓ తెలంగాణ కుర్రాడిలా కనిపించబోతున్నాడు. వరుణ్ తేజ్ చెప్పిన తెలంగాణ డైలాగులు కొంత నొక్కి పలికినట్టు.. అసహజంగా అనిపిస్తాయి. షూటింగ్ కు ప్యాకప్ చెప్పేసిన యూనిట్… సంక్రాంతి బరిలో ఎఫ్2ను దింపేందుకు సినిమాకు మేకప్ వేస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్, లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates