పండుగకు ముందే ఖైరతాబాద్ గణేషుని దర్శనం

KAI64 సంవత్సరాల చరిత్ర ఉన్న ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది సప్త ముఖ కాల సర్ప మహాగణపతిగ భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఏకదంతుడి కొత్త రూపాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎదురు చూస్తుంటారు. అందుకే పండగకు 10 రోజుల ముందు భక్తులకు దర్శనం కలిపించేల గణపతి తయారీ పనులు సాగుతున్నాయి.
ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది 57నుంచి 60అడుగుల ఎత్తులో.. 27అడుగుల వెడల్పుతో తయారవుతున్నాడు. 14 చేతుల వినాయకుడు దర్శనమివ్వనున్నాడు. కుడివైపు అంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గద.. ఎడమ వైపు పాశం, శంకు, కమలం, ఢమరుకం, విల్లు, కడియం, లడ్డు ఉంటాయి.
వినాయకుడి వాహనంగా ఈ ఏడాది 6 ఏనుగులు ..గొడుగుగా.. తలపై ఏడు తలలతో ఆది శేషుడు.. కుడి వైపు 14అడుగుల ఎత్తులో లక్ష్మీ దేవి, ఎడమ వైపు సరస్వతి అమ్మవారు కొలువు తీరతారు. గతేడాది లాగానే ఈ ఏడాది కూడా తాపేశ్వరం లడ్డు లాగే పీఓపీ లడ్డూ ఉంటుంది. ఆనవాయితీ ప్రకారం వినాయకుడి రెండు వైపులా దేవతామూర్తులు కూడా ఉంటారు. కుడి వైపు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం సెట్.. ఇందులో హోమగుండం దగ్గర అమ్మవారి కన్యాదానం..అప్పగింతలు. అతిధులుగా శివపార్వతులు, సరస్వతి ..బ్రహ్మలతో పాటు కుబేరుడు, గరుత్మంతుడు, నారదులు ఉంటారు. ఎడమ వైపు 14అడుగుల ఎత్తుతో కుమార స్వామితో శివపార్వతులు దర్శనమిస్తారు.
మే 25 ఏకాదశి రోజున భూమి, కర్ర పూజతో వినాయకుడి నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పటివరకు వినాయకుడి విగ్రహ పెట్టే షెడ్ పనులు పూర్తి చేశారు. వెల్డింగ్ పనులు 90శాతం పూర్తియినట్లు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిగా విగ్రహ భాగాలను అమర్చి వెల్డింగ్ చేస్తామన్నారు. వినాయకుడికి నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా.. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మందితో రోజుకు 12నుంచి 14గంటల వరకు నిర్మాణ పనులు చేయిస్తున్నామంటున్నారు శిల్పి రాజేంద్ర. ఈ ఏడాది వినాయకుడితో పాటు మండపాల సెట్ కి కూడా చాలా పని ఉంటుందని చెబుతున్నారు. వినాయక చవితి కంటే పదిరోజుల ముందే..భక్తులకు దర్శనిమిచ్చేలా మహాగణపతి పనులు వేగంగా జరుగుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates