పండుగ ధమాకా… కొత్త కార్లు, బైక్ లకు ఫుల్ గిరాకీ

హైదరాబాద్ : దసరా సందర్భంగా హైదరాబాద్ నగరంలో టీ వీలర్లు, ఫోర్ వీలర్లు బాగా అమ్ముడయ్యాయి. పండుగ సెంటిమెంట్, తగ్గింపు ధరల ఆఫర్లతో… కొత్త బండ్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపించారు. షోరూంలన్నీ జనంతో సందడిగా కనిపించాయి. తమకు కావాల్సిన మోడల్స్, వాటి ఫీచర్ల గురించి తెల్సుకుంటూ షోరూంలలో ఎక్కువగా కనిపించారు పబ్లిక్.

దసరా పండుగ ఒక్కరోజులోనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఐదు వేలకు పైగా కార్లు… 20వేలకు పైగా బైక్ లు అమ్ముడుపోయాయి. మామూలు రోజుల్లో కంటే.. దసరా నాడు కార్ల గిరాకీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువయ్యింది. బైక్ లు… 25శాతం ఎక్కువగా సేల్ అయ్యాయి.  అమ్ముడు పోయిన కార్లలో ఎక్కువ కార్లు బడ్జెట్ కార్లే. ఐదు వేల కార్లు సేల్ అయితే.. అందులో 60శాతం కార్లు.. రూ.పది లక్షల రూపాయల లోపువే. రూ.ఐదు లక్షల నుంచి రూ.8లక్షల మధ్య ధర ఉన్న కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయని ట్రేడర్లు తెలిపారు.

పండుగ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని షోరూమ్స్ భారీగా బంపర్ ఆఫర్లను పెట్టి కస్టమర్లను ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. పలు కార్ల కంపెనీలు.. ఫ్రీ ఇన్సూరెన్స్, స్క్రాచ్ కార్డులు, గిఫ్ట్ కూపన్స్, లక్కీ డ్రాలో కార్లను బహుమతిగా ప్రకటించాయి. డౌన్ పేమెంట్ ను బాగా తగ్గించేశాయి. కొన్ని కంపెనీలైతే.. జీరో డౌన్ పేమెంట్ తో కారును మీ ఇంటికి తీసుకువెళ్లండి అంటూ ఆఫరిచ్చేశాయి. కార్ల రేట్లలోనూ… 30 వేల నుంచి.. 70 వేల దాకా డిస్కౌంట్లు ఇచ్చాయి. కస్టమర్లను ఎట్రాక్ట్ చేసి సేల్స్ భారీగా పెంచుకున్నాయి.

Posted in Uncategorized

Latest Updates