పండుగ విశిష్టత : విజయదశమి శుభాకాంక్షలు

శమీ శమయతే పాపం
శమీ శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శనం   

నేడు (అక్టోబర్-18) దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు.

విశిష్టత..

ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ. పాలపిట్టను చూస్తారు.

జమ్మి ఆకుల పూజా చేయటం ఆనవాయితి..

చరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక.. పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై నుంచి తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆనవాయితి. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి ..అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు. పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజ చేసిన తర్వాత వాటి ఆకులను ఇంటికి తెచ్చకుంటారు. ముందుగా తమ ఇష్టదైవాలకు జమ్మి ఆకును పెట్టిన తర్వాత తల్లిదండ్రులకు పెట్టుకుంటారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ స్నేహా పూర్వకంగా కలిస్తూ జమ్మి ఆకును పంచుకుంటారు. దీనినే అలాయి బలాయి అంటారు. అదే విజయదశమి.

పాలపిట్టను చూడండి

పాలపిట్టను దసరా నాడే ఎందుకు చూడాలి అంటారా..దాని వెనుక పెద్ద కథే ఉంది.పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా  ఈ పాలపిట్ట కనిపించిందంట..అప్పటినుంచి వారికి విజయాలు సిద్ధించాయని జనపదుల నమ్మకం. అందుకే  విజయదశమి రోజున పూర్వం మగవాళ్లు తప్సనిసరిగా అడవికి పోయి పాలపిట్టను చూసిగానిఇంటికి వచ్చేవారు కాదంట..ప్రజల మనసుల్లో ఈ పాలపిట్టకు సాంస్కృతికంగా , పురాణాలపరంగాఇంత ప్రాధాన్యం ఉంది కాబట్టే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతోపాటు, కర్నాటక, ఒడిస్సా, బీహార్‌ల రాష్ట్ర  పక్షిగా ఇది వెలిగిపోతుంది. ఇప్పుడు ఈ పక్షి జాడ అపురూపమైపోయింది.

పల్లెల్లో ఇవి అప్పుడప్పుడు మెరుపు మెరిసినట్లుగా కనిపిస్తున్నా..సిటీల్లో మాత్రం కనిపించకుండాపోయాయి. అందుకే దసరా  పండుగనాడు కొందరు ఈ పాలపిట్టలను పట్టుకుని పంజరంలో ఉంచి చూపిస్తూ డబ్బులు వసూలు  చేస్తుంటారు. మరి కొందరు దసరా నాడు పాలపిట్టలను కొని ఊరి చివర పొలాల మధ‌్య విడిచి  పెడుతుంటారు. ఏదేమైనా దసరా పండుగ వచ్చిందంటే  ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కే పక్షిఈ పాలపిట్ట. తెలంగాణలో పాలపిట్టకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం పాలపిట్టనురాష్ట్ర పక్షిగా ప్రకటించింది. మరి ఇంతటి ప్రాశస్త్యం కల పాలపిట్టలను సంరక్షించుకోవాల్సిన బాధ్యతప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరిమీద ఉంది.. దసరా నాడు పాలపిట్టను చూడండి..సకల శుభాలు  పొందండి. వీ6 ప్రేక్షకులకు విజయదశిమి శుభాకాంక్షలు.

Posted in Uncategorized

Latest Updates