పంతులమ్మయిన ప్రణీత.. బెంగళూరులో స్కూల్ దత్తత

కర్ణాటక: గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఆ మధ్య సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ ఇన్ స్పిరేషన్ తో రియల్ లైఫ్ లో చాలా మంది సెలబ్రిటీలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీ ప్రణీత కూడా ఇదే బాట పట్టింది.  రీసెంట్ గా ప్రణీత.. హస్సన్ జిల్లా(కర్ణాటక)లోని ఆలూర్ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ను దతత్త తీసుకొని తన మంచి మనసు చాటుకుంది.

2017లో ఫస్ట్ టైం ఈ స్కూల్ లో వాలంటీర్‌గా ప‌నిచేసిన ప్రణీత ఆ సమ‌యంలో స్కూల్ పరిసరాలు, పిల్ల‌లు చ‌దివే విధానాన్ని గ‌మ‌నించి స్కూల్ ను దత్తత తీసుకోవాలనుకుంది. ముందుగా స్కూల్ డెవలప్ మెంట్ కోసం రూ. 5 ల‌క్ష‌లను  విరాళంగా ఇచ్చిన ప్ర‌ణీత స్కూల్ లో బాలికలకు టాయిలెట్స్ ఏర్పాటు చేయడమే తమ ఫస్ట్ ప్రయార్టీ అంటోంది.  పిల్ల‌ల‌కి అవ‌స‌ర‌మైన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పించాల‌నుకుంటున్నాం…. దీని కోసం ఫ్రెండ్స్  అంతా కలిసి ప్లాన్స్ వేసుకుంటున్నాం అని ప్ర‌ణీత చెప్పింది.

Posted in Uncategorized

Latest Updates