పందెం కోడి-2 ట్రైలర్ రిలీజ్

పందెం కోడి సీక్వెల్ గా వస్తోన్న పందెం కోడి-2 ట్రైలర్ ను మూవీ టీమ్ ఇవాళ (సెప్టెంబర్.29)న రిలీజ్ చేశారు.  “జాతరలో పులి వేషాలెయ్యొచ్చు.. కానీ పులి ముందు వేషాలెయ్యకూడదు”.కత్తిని చూసి భయపడటానికి పొట్టేలును కాదురా.. పులివెందుల బిడ్డని అంటూ విశాల్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగులు మూవీ పై హైప్ క్రియేట్ చేస్తోంది.  ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌ పై ఈ మూవీ తెరకెక్కుతోంది. లింగుస్వామి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. అక్టోబర్-18న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది.

లింగుస్వామి డైరెక్ష‌న్ లో విశాల్,మీరా జాస్మిన్ కాంబినేషన్ లో 2005 లో వచ్చిన పందెంకోడి సూపర్ హిట్ సాధించింది.

Posted in Uncategorized

Latest Updates