పంపకాలు ఇలా ఉన్నాయి : క్లారిటీకి వచ్చిన కర్నాటక మంత్రి పదవులు

KERకర్ణాటకలో కుమారస్వామి మంత్రివర్గంపై అధికారికంగా క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ కు 22 మంత్రి పదవులు, జేడీఎస్ కు 12 మంత్రి పదవులు దక్కాయి. కీలకమైన హోంశాఖ, ఇరిగేషన్, అగ్రికల్చర్, హెల్త్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, రెవిన్యూ, బెంగళూరు సిటీ డెవలప్ మెంట్, రూరల్ డెవలప్ మెంట్, అర్జన్ డెవలప్ మెంట్, ఫారెస్ట్, హౌసింగ్, సోషల్ వెల్ఫషేర్, మైనింగ్, సివిల్ సప్లయర్స్, లా అండ్ పార్లమెంటరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వంటి శాఖలు కాంగ్రెస్ కు దక్కాయి.

జేడీఎస్ కు ఫైనాన్స్ అండ్ ఎక్సైజ్, ఎడ్యుకేషన్, ట్రాన్ పోర్ట్, టూరిజమ్, పవర్, చిన్నతరహా పరిశ్రమలు, మైనర్ ఇరిగేషన్, వంటి శాఖలు దక్కాయి. కేబినెట్ విస్తరణ, ఎవరెవరికి ఏయే మంత్రి పదవులు కేటాయించాలన్నదానిపై కూడా ఓ  నిర్ణయం తీసుకోవడం జరిగిందని కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ తెలిపారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కలసి పోటీ చేస్తాయని తెలిపారు. బుధవారం (జూన్-6) కేబినెట్ విస్తరణ ఉంటుందన్నారు. ప్రజలకు గుడ్ గవర్నెన్స్ ఇచ్చేందుకు కలిసి పనిచేస్తామని డిప్యూటీ సీఎం పరమేశ్వర తెలిపారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కాంగ్రెస్-జేడీఎస్ లు పని చేస్తాయన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తామని ఈ సందర్భంగా పరమేశ్వరన్ వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates