పగ తీర్చుకోవాలని : స్కూల్ మధ్యాహ్నా భోజనంలో విషం కలిపింది

తమ్ముడి చావుకు కారణమైన వాళ్లపై పగ తీర్చుకోవటం కోసం 7వ తరగతి చదువుతున్న బాలిక స్కూల్ మధ్యాహ్నా భోజనంలో విషం కలిపింది. అదృష్టవశాత్తూ ఆ భోజనం ఎవ్వరూ తినకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌ లోని గోరఖ్‌ పూర్‌ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం(జులై-17) ఈ ఘటన జరిగింది.

అదే స్కూల్‌ లో చదువుతున్న బాలిక తమ్ముడిపై… ఏప్రిల్ నెలలో 5 వ తరగతి చదువుతున్న  విద్యార్థి ఇటుక రాయితో దాడి చేశాడు. దీంతో బాలిక తమ్ముడు అక్కడిక్కడే చనిపోయాడు. దీన్ని మనస్సులో పెట్టుకున్న బాలిక తన తమ్ముడి మృతికి కారణమైన వారిపై పగతీర్చుకోవాలని భావించింది. స్కూల్ లో మధ్యాహ్నా భోజనం తయారు చేస్తున్న సమయంలో అందులో విషం కలిపింది.  భోజనంలో బాలిక ఏదో కలిపిందని భావించిన వంటవాళ్లు స్కూల్ హెడ్ మాస్టర్ కి విషయం చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫుడ్‌ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ డిపార్ట్ మెంట్ అధికారులు స్కూల్ కి చేరుకొని భోజనం శాంపుల్స్‌ ను ల్యాబ్‌ కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  బాలికను, బాలిక తల్లిని పోలీసులు ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని, తాను విషం కలపలేదని బాలిక పోలీసులకు తెలిపింది.

 

Posted in Uncategorized

Latest Updates