పటాన్ చెరువులో రూ.17 కోట్లతో ఉల్లి మార్కెట్ : హరీష్

HARISHపటాన్ చెరువు మార్కెట్ యార్డులో 17 కోట్లతో ఉల్లి మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. పటాన్ చెరులో కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల మీదనే మార్కెట్ నడిపిందని.. కానీ టీఆర్ఎస్ సర్కార్ 14 ఎకరాల్లో కొత్త మార్కెట్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇక పటాన్ చెరు నియోజకవర్గంలో 4 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.

సోమవారం (జూన్-18) సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు  మంత్రులు హరీష్, తుమ్మల. కొత్తగా కట్టిన వంతెనలు, మార్కెట్ భవనం, తహశీల్ధార్ కార్యాలయం, MLA క్యాంప్ ఆఫీస్ లను ప్రారంభించారు మంత్రులు.

Posted in Uncategorized

Latest Updates