పట్టపగలే బ్యాంక్ దోపిడీ…అడ్డొచ్చిన క్యాషియర్ ని చంపేశారు

ఢిల్లీలో పట్టపగలే బ్యాంక్ దోపిడీ జరిగింది. అందరూ చూస్తుండగానే మాస్క్‌ లతో వచ్చిన గుర్తు తెలియని అగంతకులు బ్యాంక్‌ను దోపిడి చేశారు. అడ్డుకున్న క్యాషియర్‌ సంతోష్‌కుమార్‌ (45) ని తుపాకితో కాల్చి చంపారు. చావ్లా ఏరియాలోని  కార్పోరేషన్‌ బ్యాంకు బ్రాంచిలో  శుక్రవారం(అక్టోబర్-12)  ఈ ఘటన జరిగింది.

ఈ దోపిడీలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, ముఖాలకు మాస్క్‌లు ధరించి, తుపాకులతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన క్యాషియర్ సంతోష్‌ ను షూట్‌ చేశారన్నారు. బుల్లెట్‌ అతని చాతిలోకి దూసుకెళ్లిందని, తము సంఘటనాస్థలికి వచ్చేలోపే దుండగులు తప్పించుకున్నారని, రక్తపుమడుగులో ఉన్న సంతోష్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించామని కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. రూ.2 లక్షలు ఎత్తికెళ్లినట్లు బ్యాంకు ఉద్యోగులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Posted in Uncategorized

Latest Updates