పట్టాలు తప్పిన.. దర్భంగా – కోల్‌ కతా ఎక్స్‌ప్రెస్‌

పాట్నా : బీహార్‌ లోని దర్భంగా స్టేషన్‌ కు సమీపంలోని రైల్వే క్రాసింగ్ దగ్గర ఈ ఉదయం (సెప్టెంబర్-28) ప్రమాదం జరిగింది. దర్భంగా – కోల్‌ కతా ఎక్స్‌ప్రెస్‌ లోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో రైల్వే అధికారులు అక్కడికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని సమాచారం. దర్భంగా – కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates