పట్టాలు తప్పిన పూజా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్

RAIపూజా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రాజస్ధాన్ లోని పులేరాలో ఈ రోజు మధ్యాహ్నాం 3:45గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మూడు స్లీపర్ బోగీలు పట్టాలు తప్పాయి. అందరూ సేఫ్ గానే ఉన్నారని, ఎవ్వరికీఎటువంటి గాయాలవ్వలేదని అధికారులు తెలిపారు. జైపూర్ వైపు రెలు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే CPROతరుణ్ జైన్ తెలిపారు. జమ్మూతావి-అజ్మీర్ ల మధ్య ఈ రైలు ట్రావెల్ చేస్తుంది. దీనివల్ల పలురైళ్ల రాకపోకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. జూన్-10న కూడా మహారాష్ట్రలోని ఇగత్ పురి రైల్వే స్టేషన్ దగ్గర్లో హౌరా మెయిల్ ట్రైన్ బోగోలు మూడు పట్టాలు తప్పాయి. దీంతో ఈ రూట్లో వచ్చే 12 రైళ్లను అధికారులు రద్దు చేశారు. 7 రైళ్ల రూటు మార్చురు.

Posted in Uncategorized

Latest Updates