పడిపోయిన ఐఫోన్ : ప్రపంచవ్యాప్తంగా సామ్ సంగ్ నెంబర్1

samsungప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్. 2017 నాలుగో క్వార్టర్ లో అంతర్జాతీయంగా స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 4.6 శాతం తగ్గినప్పటికీ, 18.2 శాతం వాటాతో సామ్‌సంగ్ టాప్ ర్యాంకును దక్కించుకుంది. సామ్‌సంగ్ ఎస్8, ఎస్8+ అమ్మకాలు కొంతమేర తగ్గినప్పటికీ ఆ మోడళ్లలో వచ్చిన ఫోన్లతో మొత్తంగా మంచి వృద్ధి నమోదు చేసినట్లు గార్టనర్ తెలిపింది. మొత్తంగా నాలుగో క్వార్టర్ లో ప్రపంచవ్యాప్తంగా 408 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయినట్లు గార్టనర్ తెలిపింది. అయితే ఐఫోన్ల అమ్మకాలు 5 శాతం మేర పడిపోయాయని గార్టనర్ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates