పడి పడి లేచే మనసు రిలీజ్ డేట్

హను రాఘవపూడి డైరెక్షన్ లో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. ఈ మూవీని డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు బుధవారం (జూలై-25) అఫీషియల్ గా అనౌన్స్ చేసింది యూనిట్. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ పోస్టర్ ని వదిలారు. ఇందులో హీరో ..హీరోయిన్ ను ఎత్తుకుని ఉన్నాడు. ఇద్దరి మధ్యన మంచి లవ్ స్టోరీ ఉన్నట్లు పోస్టర్ లోనే చెప్పకనే చెప్పాడు డైరెక్టర్ హను. సినిమా రిలీజ్ పై సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో సంతోషం పంచుకున్నహీరో శర్వానంద్.. డిసెంబర్ 21న కలుద్దామని ట్విట్ చేశాడు. ధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌ గా నటిస్తోంది. కొల్‌ కతాలో సాగే ఈ ప్రేమకథ షూటింగ్‌ పూర్తి కావచ్చిందని.. త్వరలో నేపాల్‌ లో జరగనున్న షెడ్యూల్‌ లో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందని వెల్లడించారు యూనిట్ సభ్యులు. విశాల్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ కీలక పాత్రలో నటిస్తుండగా సునీల్ గెస్ట్ రోల్‌ లో అలరించనున్నాడు.

Posted in Uncategorized

Latest Updates