పదవీ విరమణ చేస్తున్న ఎంపీలకు మోడీ ఫేర్‌వెల్ విషెస్

modi-gulam-nabi-assadరాజ్యసభ కాల పరిమితి ముగిసిన ఎంపీలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మాట్లాడారు. పదవీ విమరణ చేస్తున్న ఎంపీలకు ఆయన ఫేర్‌వెల్ విషెస్ చెప్పారు. రాజ్యసభ సభ్యుల అనుభవం ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపేందుకు సహకరిస్తుందన్నారు. కాల పరిమితి ముగుస్తున్న సభ్యుల పేర్లను ప్రధాని చదివి వినిపించారు. కే.పరసరన్, దిలీప్ కుమార్ టిర్కీ, సచిన్ టెండూల్కర్, కురియన్‌ల పదవీ కాలం నేటితో ముగియనున్నది. త్రిపుల్ తలాక్ లాంటి చరిత్రాత్మకమైన బిల్లులో మీలాంటి వాళ్లు భాగస్వామ్యులైతే మరింత బాగుండేదన్నారు మోడీ. రిటైర్ అవుతున్న ఎంపీలు దేశ భవిష్యత్తు కోసం శ్రమిస్తారని ఆశిస్తున్ననన్నారు మోడీ. భవిష్యత్తులోనూ మీకు విజయం చేకూరాలన్నారు. ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ కూడా మాట్లాడారు. ఫేర్‌వెల్ అనేది పాక్షికమని, ఓ రాజకీయవేత్త ఎన్నటికీ పదవీవిరమణ చేయలేరన్నారు. రిటైర్ అవుతున్న సభ్యులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates