పదవుల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు : మెహబూబా ముఫ్తీ

MEHAపదవుల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోలేదన్నారు సీఎం మెహబూబా ముఫ్తీ. కశ్మీర్ లో శాంతి స్థాపన, సరిహద్దులో కాల్పుల విరమణ, జమ్మూకశ్మీర్ ప్రజలతో చర్చలు, పాకిస్థాన్ తో మంచి సంబంధాలు కొనసాగించాలన్న లక్ష్యంతోనే పొత్తుపెట్టుకున్నట్టు చెప్పారు. వేరే పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఆలోచన లేదని చెప్పారు. బీజేపీ ప్రకటన చేసిన వెంటనే ఆమె తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. అయితే పీడీపీ ప్రభుత్వం పూర్తిగా విషలమైందన్నారు బీజేపీ జాతీయనాయకుడు రామ్ మాధవ్. జమ్మూ-కశ్మీర్ లో పౌరుల ప్రధమిక హక్కులకు భంగం వాటిల్లుతుందనటానికి ఇటీవల జరిగిన జర్నలిస్టు హత్యే నిదర్శనమన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates