పదహారేళ్ల కుర్రాడి గ్లోబల్ విజయం

పట్టుదల ఉంటే, దానికి సాధన తోడైతే సాధిం చలేనిది ఏదీ లేదు. బెంగళూరుకు చెందిన సమయ్‌ గొడిక అందరిలాగే కాలేజీలో చదువుకుంటున్నాడు. ప్రపంచస్థాయిలో జరిగే గ్లోబల్‌ సైన్స్‌ వీడియో కాంపిటీషన్‌‌లో పాల్గొ న్నాడు. ఈ కాం పిటీషన్‌‌లో 13 నుం చి 18 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లే పాల్గొం టారు. ఈ పోటీలో లైఫ్ సైన్స్, మ్యాథమ్యాటిక్స్ ఫిజిక్స్‌ సబ్జెక్టులలో క్లిషమైన విషయాలను 3 నిమిషాల వీడియోలో అందరికీ అర్థమయ్యేలా చూపిం చాలి. సర్కే డియన్‌‌ రిథమ్స్ అనే విషయాన్ని ఎంచుకు ని శరీరంలో 24 గంటల్లో జీవక్రియ ఎలా జరుగుతుం దో వివరిం చాడు.అంతేకాదు విమాన ప్రయాణంలో బడలికకు కారణాలేం టో కూడా తెలియజేశాడు.సమయ్‌ చెప్పిన విషయాలు ఆసక్తిగా, పోటీకి తగిన విధంగా ఉండటంతో అతడిని విజయం వరించిం ది. దాం తో 4 లక్షల డాలర్లను బహుమతిగా దక్కించుకు న్నాడు. అంటే మన కరెన్సీ లో 2.9 కోట్లన్న మాట. ఒక్క సమయ్‌ కే కాదు అతనికి సహకరిం చిన కాలేజీ టీచర్‌‌ ప్రమీలా వీనస్‌ కు 50వేల డాలర్లు, అలాగే అతను చదివిన స్టేట్‌ ఆఫ్‌‌ ద ఆర్ట్‌‌ సైన్స్‌ ల్యాబ్‌‌కు లక్ష డాలర్లు వస్తా యి. అతనికి స్కాలర్‌‌ షిప్‌ కింద 2 లక్షల 50 వేల డాలర్లు ఇస్తారు. అయితే ఆ సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్యం సరి లేకున్నా కష్టపడి ఈ విజయాన్నిసాధిం చాడు సమయ్.

Latest Updates