పదిరాష్ట్రాల్లో ఉపఎన్నికలు : ప్రశాంతంగా పోలింగ్

POLOపదిరాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 4 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా భారీ భద్రత, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. బరిలో నిలిచిన అభ్యర్థులందరూ తమ ఓటుహక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. నాగాలాండ్ పార్లమెంట్ స్థానానికి పోటీపడుతున్న ఆర్ఎల్డీ అభ్యర్థి తబసమ్ హసన్ ఈసీకి ఓ లేఖ రాశారు. ప్రతీచోట ఈవీఎంలు ట్యాపరింగ్ జరుగుతుందని ఆరోపించారు. ముస్లింలు, దళితలు ఎక్కువగా ఉన్న చోట పాత ఈవీఎంలను మార్చాలని కోరినా… స్పందించలేదన్నారు హసన్. ఎలాగైనా గెలవాలన్న ఆశతోనే బీజేపీ కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు.

Posted in Uncategorized

Latest Updates