పదిహేనేళ్ల తర్వాత… చెప్పులు వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్త

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చాన్నాళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆ సంబురంలో.. ఒక్కో నేతా గతంలో చేసిన సవాళ్లను, శపథాలను గుర్తుచేసుకుంటున్నారు. 2003లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో.. మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్.. పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేయకూడదని, రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.. అదే సమయంలో.. దుర్గాలాల్ కిరార్ అనే కాంగ్రెస్ నాయకుడు.. కూడా మరో శపథం చేశారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తప్ప తాను కాళ్లకు చెప్పులు వేసుకోనని చెప్పారు.

ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో.. పదిహేనేళ్ల తర్వాత పాదరక్షలు తొడిగారు. సీఎం కమల్ నాథ్, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సమక్షంలో… బుధవారం రోజున దుర్గాలాల్ కిరార్ తన కాళ్లకు బూట్లు వేసుకున్నారు. ఈ విషయాన్ని కమల్ నాథ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కార్యకర్తలు అంకితభావంతో కష్టపడటం వల్లే కాంగ్రెస్ కు విజయం దక్కిందన్నారు కమల్ నాథ్.

 

Posted in Uncategorized

Latest Updates