పద్మభూషణ్ అందుకున్న ధోనీ

dhonibhushanటీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ, బిలియర్డ్స్ ప్లేయర్ పంకజ్ అద్వానీ సోమవారం (ఏప్రిల్-2) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. క్రికెట్‌లో ICC మూడు మేజర్ టోర్నీలు గెలిచిన కెప్టెన్‌గా ధోనీకి పేరుంది. క్రికెట్‌లో అతడు దేశానికి చేసిన సేవలకుగాను గతంలోనే పద్మశ్రీ అందుకున్నాడు. సరిగ్గా ఏడేళ్ల కిందట ఇదే రోజు టీమిండియాకు వరల్డ్‌కప్ అందించాడు ధోనీ. ఇప్పుడు దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్‌ను కూడా ఇదే రోజు అందుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి ధోని కుటుంబ సమేతంగా హాజరయ్యారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన ధోని ఆర్మీ దుస్తుల్లోనే కవాతు చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి మరీ అవార్డు స్వీకరించారు. ఇక ధోని అవార్డు అందుకుంటుండగా అతని భార్య సాక్షిసింగ్‌ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేసారు. అటు బిలియర్డ్స్‌లో 18సార్లు వరల్డ్ చాంపియన్ అయిన పంకజ్ అద్వానీ కూడా పద్మభూషణ్ స్వీకరించాడు.

Posted in Uncategorized

Latest Updates