పనికిమాలిన పనులు : అమ్మాయిల బట్టలు విప్పించిన వార్డెన్

anikవాడేసిన శానిటరీ ప్యాడ్‌ లేడీస్‌ హాస్టల్‌ పరిసరాల్లో పడి ఉండటం చూసిన ఓ వార్డెన్ విద్యార్థినులకు ఘోరమైన శిక్ష విధించింది. ఆ శానిటరీ ప్యాడ్‌ ఎవరిదో చెప్పాలంటూ అమ్మాయిల లోదుస్తులను పరిశీలించే ప్రయత్నం చేయడంతో విద్యార్థినులు వీసికి ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ యూనివర్సిటీలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ యూనివర్శిటీ ఆవరణలోని రాణి లక్ష్మీబాయి హాస్టల్‌ లో 40 మందికిపైగా విద్యార్థినులు ఉంటున్నారు. శనివారం(మార్చి24) హాస్టల్‌ను తనిఖీచేసిన వార్డెన్‌ వాడిపారేసిన శానిటరీ ప్యాడ్‌ పడి ఉండటాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయింది. అమ్మాయిలందరినీ వరసలో నిలబెట్టి తన సహాయకురాలి సాయంతో వాళ్ల లోదుస్తులు విప్పించింది. దీంతో తీవ్ర అవమాన భారంతో వార్డెన్‌ను, సహాయకురాలిని తొలగించాలంటూ యూనివర్శిటీ వీసీకి ఫిర్యాదు చేశారు విద్యార్థినులు. ఈ సంఘటనను పరిశీలిస్తున్నామని, తప్పు చేసినట్లు తేలితే తీవ్ర చర్యలు తీసుకుంటామని సాగర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఆర్‌పీ తివారీ తెలిపారు. దీనిపై ఇప్పటివరకు పోలీసు కేసు నమోదు కాలేదు.

Posted in Uncategorized

Latest Updates