పనులు చకచకా : సీతారామ ప్రాజెక్టుకు లైన్ క్లీయర్

seetharam a projectఖమ్మం జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన.. సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణి బోర్డు అనుమతిచ్చింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం పంపించింది కేంద్ర అటవీ పర్యావరణ శాఖ. ఎకో సెన్సిటివ్ జోన్ లోని దాదాపు 11వందల ఎకరాల్లో.. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టేందుకు అభ్యంతరాలు లేవని.. వన్యప్రాణి బోర్డు తెలిపింది. మణుగూరు అటవీ డివిజన్ లోని 645 ఎకరాలు, పాల్వంచ అటవీ డివిజన్ పరిధిలో 455 ఎకరాల భూమిలో ప్రాజెక్టు పనులను చేసుకోవడానికి ఓకే చెప్పింది.

మార్చి 27న ఢిల్లీలో జరిగిన జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింట్ కమిటీ సమావేశంలో.. సీతారామ ప్రాజెక్టు అటవీ భూములపై చర్చించారు. మణుగూరు, పాల్వంచ అటవీ డివిజన్లలో ప్రాజెక్టు పనులకోసం భూమిని వాడుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది బోర్డు. వన్య ప్రాణలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. అవి స్వేచ్చగా తిరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. వన్యప్రాణుల సంరక్షణకు అండర్ పాస్ ల నిర్మాణం, గడ్డిని పెంచడం, అటవీ భూముల్లో ఉన్న చెరువులు, కుంటలను పూడిక తీయడం లాంటి పనులు చేపట్టాలని సూచించింది. ఇందుకోసం పాల్వంచ అటవీ డివిజన్ పరిధిలో 123 లక్షలు, మణుగూరు డివిజన్ లో 118.216లక్షలతో వన్యప్రాణి సంరక్షణతో చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది రాష్ర ప్రభుత్వం.

వన్యప్రాణి అనుమతులు రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో 6.74లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణి  బోర్డు అనుమతులు రావడంపై మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం అటవీ పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ కు థ్యాక్స్ చెప్పారు. త్వరలోనే రెండో విడత అటవీ అనుమతులు సాధిస్తామన్నారు హరీష్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates