పబ్లిక్ డిమాండ్ : పెట్రో రేట్లను GSTలో చేర్చండి

petrolఆయిల్  ధరలు ఆల్ టైం  హైకి చేరడంతో దేశవ్యాప్తంగా నిరసనలు  పెరిగాయి. పెట్రో ధరలను GST పరిధిలోకి  తీసుకురావాలన్న డిమాండ్  పెరిగింది. రోజూవారీ ధరల సమీక్షా విధానం వచ్చాక.. ఆయిల్ ధరలు ఈ స్థాయికి  చేరడం ఇదే ఫస్ట్ టైం. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 82 రూపాయలకు చేరింది. డీజిల్ ధరలు భారీ పెరుగుతుండటంతో.. రోజు కూలీ గిట్టుబాటు కావటం లేదంటున్నారు ఆటోవాలాలు. ఇలాగే పెరుగుతూ పోతే నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం తప్పదంటున్నారు. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే.. సామాన్యులు వాహనాలు ఎలా నడపాలని నిలదీస్తున్నారు. పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

కర్ణాటక ఎలక్షన్స్ టైంలో ధరలు పెరగకుండా ఆపి.. ఇప్పుడు అమాంతం పెంచడంపై మండిపడుతున్నారు. ముంబైలో అత్యధికంగా 84 రూపాయలు దాటడంతో వాహనదారులు భగ్గుమంటున్నారు. ఐదేళ్ల క్రితం ఏం మాట్లాడారు.. ఇపుడేం చేస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

పెట్రో ఉత్పత్తులను GST పరిధిలోకి తేవడం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని అసోచామ్ సెక్రెటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. ఇంధన భద్రతపై భారత్ దృష్టి కోణం మారాలన్నారు. వాటిని భారీ ఆదాయ వనరుగా ప్రభుత్వాలు చూడొద్దని సూచించారు. మరోవైపు పెట్రో ధరలపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్నారు ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్. ధరలు తగ్గింపునకు సంబంధించి ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు.

2013 సెప్టెంబర్ 14న ఢిల్లీలో 76 రూపాయల 06 పైసలకు చేరింది. ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది. గతేడాది జూన్ లో మొదలైన రోజువారీ ధరల సమీక్షా విధానంతో 100 రూపాయలకు చేరువయ్యాయి. ఈ పెరుగుదల ఏ స్థాయికి వెళ్తాయోనని భయపడిపోతున్నాడు సామాన్యుడు.

Posted in Uncategorized

Latest Updates