పరిపూర్ణానంద ఇష్యూ.. బీజేపీ నేతల అరెస్ట్

పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ..మంగళవారం (జూలై-17) ప్రగతిభవన్ కు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డిని బషీర్ బాగ్ లోని పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు నారాయణ గూడ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత కంచన్ బాగ్ పీఎస్ కు తరలించారు. అసెంబ్లీ దగ్గర బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఇతర బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే నిరసన తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు నేతలు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.

Posted in Uncategorized

Latest Updates