పరిపూర్ణానంద నగర బహిష్కరణ : అర్ధరాత్రి అరెస్టు.. కాకినాడకు తరలింపు

గృహనిర్భందంలో ఉన్న స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఆయనను అదుపులోకి తీసుకుని కాకినాడ శ్రీపీఠానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు తానుగా సిటీ నుంచి వెళ్లిపోవాలని.. మంగళవారం సాయంత్రమే బహిష్కరణ నోటీసులిచ్చారు సిటీ పోలీస్ కమిషనర్. పోలీసుల ఆదేశాలను స్వామీజీ పాటించకపోవటంతో.. ఆయన్ను   బధవారం (జూలై-11)తెల్లవారుజామున 4 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది నవంబర్ 1న నారాయణఖేడ్ సభలో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో.. స్వామీజీ చేసిన ప్రసంగంపై అభ్యంతరాలున్నాయి. 8నెలలుగా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నోటీసు ఇచ్చారు పోలీసులు.

కత్తి మహేశ్ రామునిపై చేసిన కామెంట్లపై సీరియస్ అయ్యారు పరిపూర్ణానంద. సోమవారం (జూలై-9) యాదాద్రి వరకు ధార్మిక చైతన్య యాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. పోలీసులు అనుమతించకపోవటంతో ఒక రోజు దీక్ష చేశారు. మంగళారం స్వామీజీని గృహ నిర్భందంలో ఉంచిన పోలీసులు ఆయనతో చర్చలు జరిపారు. పాదయాత్ర విరమించుకోవాలని సూచించారు. అయినప్పటికీ స్వామీజీ వెనక్కి తగ్గలేదు. దీంతో నగర బహిష్కరణ చేశారు  పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates