పరిసరాలు పచ్చగా ఉంటేనే ఆరోగ్యం : వివేక్ వెంకటస్వామి

VIVEKహైదరాబాద్ ను ప్లాస్టిక్ లేని సిటీగా మార్చడంలో అందరూ భాగం కావాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ వెంకటస్వామి. పరిసరాలు పచ్చగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటేందుకు ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఆదివారం (జూన్-3) నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో గ్రీన్ లేస్ సొసైటీ నిర్వహించిన 3 కే రన్ ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి. గ్రీన్ రన్ కి విశాక ఇండస్ట్రీస్ స్పాన్సర్ గా వ్యవహరించింది. కార్యక్రమంలో GHMC అధికారులు, విశాఖ ఇండస్ట్రీస్ ప్రతినిథులతో పాటు సిటీ జనం  ఉత్సాహంగా పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates