పరువు కావేరీలో కలిపేశారు : నిరాహార దీక్షలో బిర్యానీ, మందు

aimdkఆమరణ దీక్ష చేపట్టారు.. కావేరీ జల వివాదంపై బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.. జనాన్ని కదిలించటం కోసం ఏకంగా ప్రభుత్వమే ఈ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇంకేముందీ మంత్రులు అందరూ జిల్లా కేంద్రాల్లో దీక్షలకు దిగారు. అయితే తెర వెనక తతంగం ఇప్పుడు జయలలిత పార్టీ పరువుని కావేరీలో కలిపింది. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజులుగా అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ లోక్ సభలో రచ్చ చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు దీక్ష చేపట్టారు. మధురై, కోయంబత్తూర్, సేలం, వెల్లూరు ప్రాంతాల్లో పార్టీకి బలం ఉండటంతో అక్కడ భారీగా జన సమీకరణతో పెద్ద పెద్ద దీక్ష వేదికలతో హంగామా చేశారు. ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది.

దీక్షకి తరలివచ్చిన జనానికి భారీ విందు ఏర్పాటు చేశారు. దీక్ష శిబిరం వెనక బిర్యానీ, టమాట రైస్ తో ఘుమఘుమలు పెట్టారు. అంతేకాదు ఒక్కో పెద్ద మనిషికి క్వార్టర్ బాటిల్ మందు ఇచ్చారు.. ఒక్కో కుర్రోడికి బీరు బాటిల్ చేతిలో పెట్టారు. యువకులు అయితే పార్టీ టీ షర్ట్ లు ధరించి మరీ దీక్ష శిబిరం వెనక మందు కొట్టటం కనిపించింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు తమిళనాడు టీవీలు, సోషల్ మీడియా హోరెత్తించింది. నిరాహార దీక్షలో బిర్యానీ, మందు ఏంటీ అని దుమ్మెత్తిపోస్తోంది. అంతేనా అన్నాడీఎంకే పార్టీ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైలేజ్ కోసం దీక్ష చేపడితే.. ఉన్న పరువు కూడా కావేరీలో కలిసి పోయిందంటూ మరికొందరు తిట్టిపోస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates