పరువు తీయొద్దు ప్లీజ్ : వరస సెలవులపై బ్యాంకులు క్లారిటీ

banks

బ్యాంకులకు వరసగా సెలవులు.. ఐదు రోజులు మూతబడుతున్నాయి.. మీ పనులు ఏమైనా ఉంటే ముందుగానే చక్కబెట్టుకోండి అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. బ్యాంకులకు వరస సెలవులపై నెటిజన్లు కూడా వింతగా స్పందించారు. నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బులే లేవు.. ఏటీఎంలు పని చేయవు.. సెలవు అయితే ఏంటీ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య స్పందించింది.

బ్యాంకులకు వరసగా ఐదు రోజులు సెలవులు అనే ప్రచారం అవాస్తవం అని వెల్లడించింది. గురువారం నుంచి ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు అనే వార్తలో నిజం లేదని చెప్పింది. వరుస సెలవులు లేవంటూ స్పష్టం చేసింది. గురువారం 29 మహవీర్‌,  శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవులు ఉన్నాయి. మార్చి 31 ఐదో శనివారం అని.. ఆ రోజు బ్యాంకులు పని చేస్తాయని ప్రకటించారు సమాఖ్య జనరల్‌ సెక్రటరీ థామస్‌ ఫ్రాంకో రాజేంద్ర దేవ్‌ తెలిపారు.  ఏప్రిల్‌ ఒకటి ఆదివారం. ఏప్రిల్‌ 2న బ్యాంకులకు సెలవు దినమా.. కాదా అనేది మాత్రం సమాఖ్య కూడా స్పష్టంగా ప్రకటించలేదు. ఏప్రిల్ 2వ తేదీన ఇయర్ ఎండ్ లెక్కలు చూసుకుంటారు. ఆ రోజు బ్యాంక్ ఉన్నా.. లావాదేవీలు మాత్రం జరగవు. ఐదు రోజులు వరసగా కాకపోయినా.. శనివారం ఒక్క రోజు వర్కింగ్ డేతో.. నాలుగు రోజులు అయితే హాలిడేస్ అని చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates