పరువు తీశారు : సంజూ టీమ్ కు గ్యాంగ్ స్టర్ అబూ సలీమ్ నోటీసులు

సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా సంజు. జూన్-29 న విడుదైలైన సంజూ మూవీ విమర్శల ప్రసందలందుకొంటూ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టింది. సినిమాలో సంజయ్ దత్ పాత్ర పోషించిన హీరో రణబీర్ కపూర్ నటన అందరి ప్రశంసలందుకుంది. అయితే సంజు సినిమాలో తన పాత్రను తప్పుగా చిత్రీకరించారంటూ గ్యాంగ్ స్టర్ అబూ సలీమ్ సంజూ మూవీ డైరక్టర్ రాజ్ కుమార్ హిరాణి, నిర్మాతలు విధు వినోద్ చోప్రా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ లకు తన లాయర్ ప్రశాంత్ పాండే ద్వారా నోటీసులు పంపారు. సినిమాలో తన పాత్రను చూసి భాధకలిగిందని, తనను అప్రతిష్ఠపాలు చేసే విధంగా తన క్యారెక్టర్ ని చూపించారని అబూ సలీమ్ తెలిపారు. సినిమాలో చూపించిన విధంగా తాను సంజయ్ దత్ కు ఆయుధాలు సప్లయ్ చేయలేదని అబూ సలీమ్ ఆ నోటీస్ లో తెలిపారు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో అబూ సలీమ్ జీవిత ఖైధు శిక్ష అనుభవిస్తున్నాడు.

Posted in Uncategorized

Latest Updates