పర్యాటకులను ఆకట్టుకుంటున్న ముత్యాల జలపాతం

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో  పర్యాటకులను కనువిందు చేస్తోంది ముత్యాల జలపాతం. వెంకటాపురం మండలంలం ఛత్తీస్ గఢ్ సరిహద్దులో ఉంది ఈ జలపాతం. 700 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే  జలపాతం అందాలు చూసేందుకు చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు. భద్రాచలంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది.

జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు 35 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు అధికారులు. కృష్ణమ్మ ఉరకలేసుకుంటూ పాలమూర్ కు పరుగులు పెడుతోంది.

Posted in Uncategorized

Latest Updates