పర్యావరణానికి హాని కలగకుండా ప్లాస్టిక్ ఉత్పత్తులు చేపట్టాలి : కేటీఆర్

పర్యావరణానికి హాని కలగకుండా ప్లాస్టిక్ ఉత్పత్తులు చేపట్టాలని సూచించారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు . దీని ద్వారా ఉద్యోగులతో పటు పెట్టుబడులు వస్తాయన్నారు.

ప్లాస్టిక్ ఇండస్ట్రీలో చిన్న మధ్య తరహా కంపెనీలు 85శాతం ఉన్నాయన్నారు. శుక్రవారం (ఆగస్టు-3) హైదరాబాద్ లోని హైటెక్స్ లో సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ప్లాస్టిక్ ఎక్సిబిషన్ ఐప్లెక్స్ 2018 ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఎక్స్ పోలో 300 స్టాల్స్ ఏర్పాటు చేశారు.

టీఎస్ ఐపాస్ ద్వారా ప్లాస్టిక్ ఇండస్ట్రీలో పెట్టుబడులు తెలంగాణకి వచ్చాయన్నారు. ప్లాస్టిక్ ఇండస్ట్రీలో చిన్న మధ్య తరహా కంపెనీలు 85శాతం ఉన్నాయని..సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ని నిషేధించామన్నారు. దీనికి ప్లాస్టిక్ ఇండస్ట్రీ సహకరించాలని సూచించారు. రీ యూజేబుల్ ప్లాస్టిక్ కి మేము సహకరిస్తామన్నకేటీర్ ఇండస్ట్రీతో కలిసి పని చేస్తామని తెలిపారు. ప్లాస్టిక్ ఇండస్ట్రీ చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates